నిజామాబాద్ లో విషాదం - రివాల్వర్ మిస్ ఫైర్ తో ఏఆర్ ఇన్స్పెక్టర్ మృతి
హెడ్ క్వార్టర్స్ లో సర్వీస్ రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం - స్పాట్ లోనే కుప్పకూలిన ఇన్స్పెక్టర్ సతీష్
నిజామాబాద్ క్రైమ్, సెప్టెంబర్ 18 :
నిజామాబాద్ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో పనిచేస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ (40) రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
అసలేం జరిగింది?
శుక్రవారం ఉదయం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని హెడ్ క్వార్టర్ లో సతీష్ తన సర్వీస్ రివాల్వర్ ను శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. బుల్లెట్ నేరుగా తగలడంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.
గన్ పేలిన శబ్దం విని ఇతర సిబ్బంది అక్కడికి పరుగున చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న సతీష్ ను చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనను ఆయన అధికారికంగా ధ్రువీకరించారు.
పోలీస్ శాఖలో విషాద ఛాయలు:
సతీష్ మృతి జిల్లా పోలీస్ శాఖను తీవ్రంగా కలచివేసింది. హెడ్ క్వార్టర్స్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మృతుడు సతీష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కొత్తపల్లి అని, తన NSB సెలవులు ముగించుకుని విధులకు హాజరయ్యారని తోటి సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


إرسال تعليق