Top News

Accident | స్కూల్ కు వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి లారీ చక్రాల కింద మృతి

బాన్సువాడలో విషాదం 

స్కూల్ కు వెళ్తున్న ఏడేళ్ల చిన్నారి లారీ చక్రాల కింద పడి మృతి

స్కూల్ యూనిఫాంలోనే...

స్కూల్ లు వెళ్లాల్సిన చిన్నారి... మృత్యువు ఒడిలోకి..!!

 బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్తున్న ఏడేళ్ల చిన్నారి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.




ఘటన వివరాలు:

వాసవి కాలనీ, బాన్సువాడ పట్టణానికి చెందిన మహమ్మద్ రఫీ (36), తన మోటార్ సైకిల్ నంబర్ TS16 EC 2186పై తన కుమారులు మహమ్మద్ అర్హన్ (8), మహమ్మద్ అయాన్ (6) కుమార్తె జైనాబ్ ఫాతిమా (4)లను పాఠశాలలో వదిలేందుకు ఇంటి నుండి బయలుదేరారు. తన ముగ్గురు పిల్లలను బైక్ పై ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా ఉన్న హీరా మోడల్ స్కూల్ కు తీసుకెళ్తున్నారు. వారు తాడ్కోల్ చౌరస్తా వద్దకు చేరుకున్న సమయంలో MH34 AB 3905 నంబరు గల టాటా లారీని నడుపుతున్న డ్రైవర్ షేక్ మొహమ్మద్, నివాసం దెగ్లూర్, లారీని అతివేగంగా మరియు అజాగ్రత్తగా నడుపుతూ వెనుక నుండి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న వారంతా రోడ్డుపై పడిపోగా, నాలుగేళ్ల బాలిక జైనాబ్ ఫాతిమా తలపై నుండి లారీ ముందు భాగంలోని ఎడమ వైపు టైర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మహమ్మద్ రఫీ, మహమ్మద్ అర్హన్ మరియు మహమ్మద్ అయాన్‌లకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వీడియోలు 👇👇







ఈ విషయం తెలియగానే తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మా బేగం ఏజాజ్, కౌన్సిలర్లు కాలేఖ్, హకీమ్, వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్థానికులు చౌరస్తాలో అడ్డంగా ఉన్న ఫ్లెక్సీల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించడంతో ఎస్హెచ్ఓ తుల శ్రీధర్ వెంటనే  స్పందించి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఘటనపై మృతురాలి తండ్రి మహమ్మద్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

స్కూల్ యూనిఫాంలోనే...

స్కూల్ లు వెళ్లాల్సిన చిన్నారి... మృత్యువు ఒడిలోకి..!!

ఉదయం 9 గంటలు... జైనబ్ ఫాతిమా స్కూల్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. కొత్త బూట్లు వేసుకుంది, బ్యాగ్ తగిలించుకుంది, వాటర్ బాటిల్ పట్టుకుంది. తండ్రి బైక్ ఎక్కగానే "నేను ముందు కూర్చుంటా" అంటూ మారాం చేసింది. తండ్రి ముగ్గురు పిల్లలను జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. ఇంటి నుంచి స్కూల్ కేవలం 5 నిమిషాల దూరం.

కానీ ఆ 5 నిమిషాల ప్రయాణం ఆ తల్లిదండ్రుల జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

ఘటనా స్థలంలో చిన్నారి స్కూల్ బ్యాగ్, ఒక చిన్న బూటు, వాటర్ బాటిల్ రోడ్డుపై పడి ఉండటం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. పుట్టెడు దుఃఖంలో తల్లి రోడ్డుపైనే బిడ్డను పట్టుకుని విలపిస్తున్న దృశ్యం అక్కడున్న వారందరినీ కదిలించింది.

తండ్రి మహమ్మద్ రఫీ - పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి. సిగ్నల్ పాటించి నెమ్మదిగా వెళ్తున్నా వెనుక నుంచి వచ్చిన లారీ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. "బిడ్డను స్కూల్లో దింపి వస్తా" అని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తి, బిడ్డ లేకుండా తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

ఒక చిన్న నిర్లక్ష్యం, అతివేగం - ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాడ్కోల్ చౌరస్తా అంటేనే రద్దీగా ఉండే ప్రాంతం. ఫ్లెక్సీలు, అతివేగం, సిగ్నల్ పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Post a Comment

أحدث أقدم