తగిలేపల్లి మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి
పాత కక్షలే కారణమా? పలు అనుమానాలు
వర్ని : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసం వెంకటేశ్వర్లు (50) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
తగిలేపల్లి శివారులోని వ్యవసాయ పొలం వద్ద మైసమ్ వెంకటెశ్వర్లు తల పై పదునైన ఆయుధంతో దాడి చేశారని తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడే మృతి చెందాడని సిఐ కృష్ణ తెలిపారు.
పొలం సరిహద్దు వివాదం, పాత రాజకీయ విభేదాలే మృతికి కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. నా భర్తను హత్య చేశారని భార్య రుకుం బాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వర్ని సీఐ కృష్ణ తెలిపారు.
మృతుడు గతంలో ఒకసారి ఎంపీటీసీగా, రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.



إرسال تعليق