BNS Ward Meetings | 11, 10, 12, 1 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు

బాన్సువాడలో ప్రత్యేక వార్డు సభలు  

11, 10, 12, 1 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు  

ఘన వ్యర్థాల నిర్వహణ, జల్ సంచయ్ పథకంపై చర్చ  

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై పట్టణ స్థాయిలో అవగాహన కల్పించేందుకు బాన్సువాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించారు.  

4 వార్డుల్లో సభలు  

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 జూన్ 4, 6, 8 మరియు 10 తేదీలలో వార్డు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 10న 11, 10, 12, 1 వార్డులలో పురపాలక సంఘం చైర్ పర్సన్ ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు.  

















చర్చించిన కీలక అంశాలు  

ఈ వార్డు సభల్లో ప్రజలకు ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:  

1. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026  

2. “జల్ సంచయ్ - జల్ భాగీదారి” పథకం కింద వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు  

3. మురుగు కాలువల పూడికతీత మరియు శుభ్రపరచడం  

4. వర్షాకాల సంసిద్ధత కార్యాచరణ ప్రణాళిక  

5. తాగునీటి సరఫరా మరియు నిర్వహణ  

6. నీటి నిల్వ నివారణ మరియు పారిశుధ్యం  

7. రోడ్లు మరియు వీధి దీపాల నిర్వహణ  

8. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు  

9. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం  

10. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు  

11. మహిళా సాధికారత కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల బలోపేతం  

12. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, యువజన సంక్షేమ కార్యక్రమాలు  

13. గ్రామీణ, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి  

14. విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు  

15. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల పురోగతి  

16. ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన  

17. తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన  

హాజరైన ప్రముఖులు  

ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ గడుమల లింగమేశ్వర్, 10వ వార్డు కౌన్సిలర్ జగన్నాథం నగేష్, 12వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది అంజాగౌడ్, 1వ వార్డు కౌన్సిలర్ నస్రీన్ బేగం ఫెరోజ్, కో ఆప్షన్ మెంబర్లు కాసుల రోహిత్, నాయకులు మహ్మద్ ఎజాజ్, పురపాలక సంఘ కమీషనర్ గోపు గంగాధర్, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, నీటిపారుదల శాఖ అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వార్డు సభలను విజయవంతం చేశారు.  


Post a Comment

أحدث أقدم