Top News

Indiramma Houses | అట్టహాసంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం



బాన్సువాడ, బీర్కూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం  

లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పోచారం

జూన్ ఆఖరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి - అధికారులకు ఆదేశం  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ/కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీ, బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు  ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.  




నిర్మాణాలు వేగవంతం చేయాలి - ఎమ్మెల్యే పోచారం  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి జూన్ నెల ఆఖరు వరకు లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనులు నెమ్మదిగా ఉన్న చోట లబ్ధిదారులతో సంప్రదించి సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించాలని సూచించారు.  

నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన లబ్ధిదారులచే వెంటనే గృహప్రవేశం చేయించాలని అన్నారు.  

ఇళ్లు మంజూరై ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో సంప్రదింపులు జరిపి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

=========================



అట్టహాసంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం

లబ్ధిదారులతో గృహప్రవేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇళ్ల గృహప్రవేశాల మహోత్సవం సోమవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని అడ్లూరి ఎస్సీ కాలనీ, వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణిలతో కలిసి లబ్ధిదారులు పెరుమాళ్ల లింగం, ఎల్లవ్వల నూతన గృహంలో గృహప్రవేశం నిర్వహించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో, కామారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్న లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. గృహ నిర్మాణాలను విజయవంతంగా పూర్తిచేసుకుని గృహప్రవేశం నిర్వహించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులు తమ సొంతింటి కలను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post