Top News

Marraige Ceremony | ఘనంగా వ్యాపారవేత్త వెంకన్న గుప్తా కుమారుడి వివాహ వేడుకలు

ఘనంగా వ్యాపారవేత్త వెంకన్న గుప్తా కుమారుడి వివాహ వేడుకలు  

కామారెడ్డిలో ఘనంగా రతీష్ - వర్ష వివాహం, బాన్సువాడలో అంగరంగ వైభవంగా రిసెప్షన్

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎంపీ బీబీ పాటిల్, ప్రముఖులు  

అతిథులను అలరించిన అలంకరణ, ఆతిథ్యం

కామారెడ్డి/బాన్సువాడ: ప్రముఖ వ్యాపారవేత్త, బాన్సువాడ పట్టణ వాస్తవ్యులు నాగులగామ వెంకన్న గుప్తా కుమారుడు రతీష్ - వర్షల వివాహం కామారెడ్డిలో, వివాహ రిసెప్షన్ బాన్సువాడలో అత్యంత వైభవంగా జరిగాయి.  


కామారెడ్డిలో వివాహం:  

జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం జరిగిన వివాహ వేడుకకు డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రత్యేక అలంకరణలతో ముస్తాబైన కన్వెన్షన్ సెంటర్ అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న గుప్తా కుటుంబ సభ్యులు అతిథులకు ఘనంగా ఆతిథ్యం అందించారు.  

బాన్సువాడలో రిసెప్షన్: 

బాన్సువాడ పట్టణంలోని GRR కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన వివాహ రిసెప్షన్ కన్నులపండువగా సాగింది. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుత్ దీప కాంతులతో GRR కన్వెన్షన్ హాల్ అచ్చంగా గార్డెన్ ఫ్యాలెస్‌ను తలపించింది. రుచికరమైన వివిధ రకాల వంటకాలు, లైవ్ ఫుడ్ కౌంటర్లు అతిథులకు అద్భుతమైన ఆతిథ్య అనుభూతిని అందించాయి.  

వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్యాన్సింగ్ బృందం, ఆర్కెస్ట్రా బృందం ప్రదర్శనలు ఆహూతులను ఉర్రూతలూగించాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో దర్శనమిచ్చిన కళాకారుడి నుంచి అతిథులు భక్తిశ్రద్ధలతో ఆశీస్సులు అందుకున్నారు.  

నూతన వధూవరులు రతీష్ - వర్షను ఆశీర్వదించేందుకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ బి.బి. పాటిల్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి ఎండల లక్ష్మీ నారాయణ తరలివచ్చారు. వారితో పాటు పలువురు వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు హాజరై వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.  

అతిథుల కోసం చేసిన పకడ్బందీ ఏర్పాట్లు, చక్కటి నిర్వహణ, ఆత్మీయ ఆతిథ్యం అందరి మన్ననలు పొందాయి. వెంకన్న గుప్తా కుటుంబ సభ్యుల ఆప్యాయతకు అతిథులు ముగ్ధులయ్యారు. బంధుమిత్రుల కోలాహలంతో, ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వివాహ, రిసెప్షన్ వేడుకలు చిరకాలం గుర్తుండిపోయేలా జరిగాయి.





Post a Comment

Previous Post Next Post