22వ తేదీ నుంచి కనిపించని ముగ్గురు, ఆచూకీ కోసం గాలించాలని వినతి
ఎస్ఎన్‌పురం గ్రామానికి చెందిన మంగలి కల్పన, ఇద్దరు పిల్లల కోసం పోలీసుల వేట
తెలంగాణ డైలీ న్యూస్, వర్ని(ఎస్ఎన్‌పురం): స్థానిక గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆరు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు.
ఎస్ఎన్‌పురం గ్రామానికి చెందిన మంగలి లచ్చయ్య శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తన భార్య మంగలి కల్పన (27), ఇద్దరు కుమార్తెలు మంగలి అక్షర (4), శ్రీవిద్య (2) తేదీ 22-06-2026 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఈరోజు వరకు తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆచూకీ వివరాలు:
తన భార్య ఇంటి నుంచి వెళ్లే సమయంలో గులాబీ రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, ఆమె ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఉండి తెలుగు భాష మాట్లాడగలదని లచ్చయ్య పోలీసులకు తెలిపాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Post a Comment