Top News

Road Accident | గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి 

దోమకొండ మండలం కృష్ణ మందిర్ వద్ద ఘటన, స్పాట్‌లోనే మృతి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 4: దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామం నుండి కామారెడ్డి వైపు బైక్‌పై వెళ్తున్న కొమ్మ మహేష్ అనే వ్యక్తిని కృష్ణ మందిర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కొమ్మ మహేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు.  

హైవే మొబైల్ పోలీసుల సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవైపు నుండి వాహనాలు సజావుగా వెళ్తున్నాయని తెలిపారు. మృతుడు బిచ్కుంద మండలంలో  గ్రామ పంచాయతీ అధికారిగా  గా పనిచేస్తున్నట్లు తెలిసింది.  

పోలీసులు కేసు నమోదు చేసి, ఢీకొట్టి వెళ్లిన వాహనం కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.



Post a Comment

Previous Post Next Post