Top News

Tank Construction | బాన్సువాడలో అమృత్ స్కీమ్ కింద వాటర్ ట్యాంక్‌కు భూమి పూజ

బాన్సువాడలో అమృత్ స్కీమ్ కింద వాటర్ ట్యాంక్‌కు భూమి పూజ

14 వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం 

పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు, భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్యాంకు నిర్మాణం 

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:  

బాన్సువాడ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి  ఆదేశానుసారం బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు ఇస్లాంపురా కాలనీ పరిధిలో అమృత్ స్కీమ్‌లో భాగంగా 14 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.  

3వ వార్డు కౌన్సిలర్  ఎం.ఏ. హకీమ్, మాజీ జిల్లా కో ఆప్షన్ అలీమ్ ఉద్దీన్ బాబా, మాజీ మండల కో ఆప్షన్ MD మెయిన్,  సబ్ కాంట్రాక్టర్ సచిన్  చేతుల మీదుగా ఈ భూమి పూజ జరిగింది.  

ఈ శుభ సందర్భంగా నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు, భాస్కర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. అమృత్ స్కీమ్‌లోని ఈ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు ఇబ్బంది లేకుండా అందుతుందని, నీళ్ల ఎద్దడి లేకుండా సౌకర్యం కలుగుతుందని నాయకులు తెలిపారు.





Post a Comment

Previous Post Next Post