Yoga Day Meeting | 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు  

బాన్సువాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం  

“Yoga for one earth - One health” నినాదంతో కార్యక్రమాలు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 18: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.

జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా “Yoga for one earth - One health” నినాదంతో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయుష్‌మాన్ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి 8 వరకు జరుగుతుంది.

యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జూన్ 21న నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

 ఈ సమావేశంలో కౌన్సిలర్లు అబ్దుల్ ఖలీక్, కటిక రమేష్, కో ఆప్షన్ సభ్యురాలి భర్త మహ్మద్ గౌస్, నిర్వాహకుడు శ్రీనివాస్,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم