అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ఆర్టీసీ బస్ పాస్ దరఖాస్తులు
జూన్ 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
tgsrtc వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 15: 2026-2028 సంవత్సరాల కాల పరిమితితో అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు ఆర్టీసీ డిస్ట్రిక్ట్ లేదా స్టేట్ బస్ పాస్ కోసం ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రాజనీకాంత్ తెలిపారు.
అర్హులైన జర్నలిస్టులు tgsrtc వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి బస్ పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


إرسال تعليق