Top News

Area Hospital | ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఎం. శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

బాన్సువాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఎం. శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ 

బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఎం. శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.

ఆసుపత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న విజయ్ భాస్కర్ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. 

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఇటీవల ఆసుపత్రిలో సిజెరియన్ అయిన 10 మంది గర్భిణీల్లో ఐదుగురు తీవ్ర అస్వస్తత కు గురైన నేపథ్యంలో ఈ మార్పు జరిగిందా అనే చర్చ జరుగుతోంది.


Post a Comment

Previous Post Next Post