30 ఏళ్లు పైబడిన వారికి ఏఎన్ఎం ల ద్వారా సేవలు
బాన్సువాడ : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 13వ వార్డులో ఎన్.సి.డి, ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్డుల ఆన్‌లైన్ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈరోజు వడ్ల సంఘం, టీచర్స్ కాలనీలో 13వ వార్డు పరిధిలోని 30 సంవత్సరములు పైబడిన అర్హులైన వారందరికీ ఏఎన్ఎం ల ద్వారా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని 13వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఖాలేక్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా ప్రారంభించారు. కాలనీవాసులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఎన్.సి.డి స్క్రీనింగ్ ద్వారా షుగర్, బీపీ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని, ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు పాల్గొని నమోదు ప్రక్రియలో సహకరించారు.

Post a Comment