CMRF | కాటేపల్లి గ్రామానికి రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ సహాయం

కాటేపల్లి గ్రామానికి రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ సహాయం 

ఎమ్మెల్యే ఆదేశాలతో ఎల్‌ఓసీ లేఖ అందజేసిన కాంగ్రెస్ నేతలు

పెద్ద కొడప్‌గల్, జూలై 27:పేద ప్రజల వైద్యానికి అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి సహాయం అందించింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  ఆదేశాల మేరకు పెద్ద కొడప్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామప్ప పటేల్ ఆదివారం కాటేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బోధనం విట్టవ్వ  అనారోగ్య చికిత్సల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి - CMRF ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ లేఖను ఆమె కుమారుడు, మాజీ సర్పంచ్ బోధనం విఠల్ కు అందజేశారు.

శ్యామప్ప పటేల్ మాట్లాడుతూ, బోధనం విట్టవ్వ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ప్రత్యేక చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరు చేయించారని తెలిపారు. 

"ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి" అని ఆయన సూచించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు మల్లప్ప పటేల్, మొహిద్దిన్ పటేల్, మొగులా గౌడ్, గంగా గౌడ్, పెంటన్న, చాంద్ పాషా, చౌటకురి శంకర్, హన్మండ్లు, రాంచందర్, హాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post