Top News

Congress Protest | కామారెడ్డిలో డీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన

రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్  

నీట్ పేపర్ లీక్ పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ 

కామారెడ్డిలో డీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన

కామారెడ్డి: ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన నిర్వహించింది.

ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు డీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన జరిగింది.

ర్యాలీగా గాంధీ విగ్రహం వద్దకు

కార్యక్రమానికి ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు.

ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఆగ్రహం

ఈ సందర్భంగా డీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతును అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిందన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, డీసీ కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.




Post a Comment

Previous Post Next Post