Top News

MCH Staff Meet to MLA | ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మాత శిశు ఆసుపత్రి సిబ్బంది

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మాత శిశు ఆసుపత్రి సిబ్బంది 

సస్పెండ్, తొలగింపు ఉత్తర్వులు రద్దు చేయాలని వినతి  

బాన్సువాడ : మాత శిశు ఆసుపత్రిలో ఇటీవల జరిగిన బాలింతల అస్వస్థత ఘటనలో ఉన్నత అధికారులు తీసుకున్న చర్యలను నిరసిస్తూ, ఆసుపత్రి నర్సులు, సిబ్బంది మంగళవారం సాయంత్రం ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

గత 20 రోజుల క్రితం మాత శిశు ఆసుపత్రిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేయగా, అనస్థీషియా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక డాక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మంగళవారం మాత శిశు ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందు నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలిపారు. "సస్పెండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి", "వైద్య సిబ్బందిపై వేటు వద్దు" అంటూ నినాదాలు చేశారు.

అనంతరం సిబ్బంది అందరూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అయన స్వగృహంలో కలిసి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని, తొలగించిన డాక్టర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.




Post a Comment

Previous Post Next Post