ఎతొండలో రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి
భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నాడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
మంత్రి పర్యటన షెడ్యూల్ వివరాలు:
- ఉదయం 9.00 గంటలకు – కరీంనగర్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరతారు.
- ఉదయం 10.30 గంటలకు– నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్వల్ప విరామం.
- ఉదయం 11.30 గంటలకు– ఆర్మూర్ నుండి బయలుదేరతారు.
- మధ్యాహ్నం 1.00 గంటలకు – నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎతొండ గ్రామానికి చేరుకొని రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.
-మధ్యాహ్నం 3.00 గంటలకు– కోటగిరి మండలం ఎతొండ గ్రామం నుండి బయలుదేరతారు.
- సాయంత్రం 4.00 గంటలకు– కామారెడ్డి జిల్లా బాన్సువాడ చేరుకుని స్వల్ప విరామం.
- సాయంత్రం 5.00 గంటలకు– బాన్సువాడ నుండి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మంత్రి నివాసానికి బయలుదేరతారు.
- రాత్రి 8.30 గంటలకు – మంత్రి నివాసానికి చేరుకుంటారు.
మంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులు వసతి, రవాణా, ఎస్కార్ట్, భద్రతా బందోబస్తు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Post a Comment