Top News

MLA PSR Visits | పాత బాన్సువాడ పల్లె దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన పోచారం

పాత బాన్సువాడ పల్లె దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన పోచారం   

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచన

బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత బాన్సువాడ పల్లె దవాఖానను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సిబ్బందితో మాట్లాడారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

సిబ్బందికి సూచనలు  

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ:  అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని  వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలను క్రమం తప్పకుండా సమీక్షించాలని,  రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచేలా అందరూ బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post