Top News

Muslim Welfare Committe |నూతన ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్‌కు ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఘన సన్మానం

నూతన ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్‌కు ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఘన సన్మానం  

ప్రజా సేవలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన

ఎల్లారెడ్డి: ముస్లిం వెల్ఫేర్ కమిటీ, ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా పదోన్నతి పొంది ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్‌లో ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్ ను కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో ఫైర్ సర్వీసెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంటూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని కోరారు.

ఎస్సై రాజును కలిసిన కమిటీ 

అదే క్రమంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కమిటీ తరపున మాజీ జెడ్పిటిసి షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్, ఉపాధ్యక్షులు ముకరమ్ అలీ, ముబీన్ అహ్మద్ పాషా, అహ్మద్ ముజీబ్, ఆదిల్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సేవలో అధికారులు, ప్రజా సంఘాలు సమన్వయంతో పనిచేస్తేనే సమాజానికి మేలు జరుగుతుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.




Post a Comment

Previous Post Next Post