బాన్సువాడ ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు
3 రోజుల శిక్షణలో నేర్చుకున్న మెలుకువలు పాఠశాలల్లో అమలు చేయాలి
విద్యార్థుల సర్వతోముఖ వికాసమే లక్ష్యం - MEO నాగేశ్వరావు
నిరంతర అభ్యాసంతోనే నాణ్యమైన బోధన సాధ్యం
బాన్సువాడ, జూలై 27: బాన్స్వాడ పట్టణంలోని GHS పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా రిసోర్స్ పర్సన్స్ బోధించిన బోధనా మెలుకువలను ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని అన్నారు.
"ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ నిరంతర విద్యార్థిగా ఉంటేనే, విద్యార్థులకు చక్కగా బోధించే అవకాశం ఉంటుంది. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో ఆచరణలో పెట్టాలి" అని MEO నాగేశ్వరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరహరి, రిసోర్స్ పర్సన్స్ అయ్యాల సంతోష్, పండరి, జరీనా, నీరజ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment