Top News

Best Nursing College | బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ అవార్డు

బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ అవార్డు  

నారాయణ్‌ఖేడ్ నుంచి ప్రత్యేక బృందం సందర్శన  

పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో పేదలకు ఉచిత విద్య

బాన్సువాడ, ఆగస్టు 21: బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ కళాశాలగా ఎంపికైంది. జూన్ 7న ఈ అవార్డును ప్రకటించగా, గురువారం కళాశాలకు నారాయణ్‌ఖేడ్ నుంచి ప్రత్యేక బృందం వచ్చి సందర్శించింది.

కళాశాలను సందర్శించిన సొసైటీ చైర్మన్ వై. కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పనితీరు, రిజల్ట్స్, మౌలిక సదుపాయాలు, నిర్వహణలో అత్యుత్తమంగా ఉండటంతోనే బాన్సువాడ కళాశాల రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. (వీడియో 👇)


నారాయణ్‌ఖేడ్ బృందం ప్రశంసలు

నారాయణ్‌ఖేడ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కళాశాలలోని ల్యాబ్, క్లాస్ రూములు, హాస్టల్‌తో పాటు అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించింది. బాన్సువాడలో జరిగిన అభివృద్ధి పనులు, కళాశాల నిర్వహణను చూసి అభినందించింది. బాన్సువాడ అభివృద్ధి ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉందని బృందం వ్యాఖ్యానించింది. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించింది.

సాధారణంగా ఇలాంటి కళాశాలలు జిల్లా కేంద్రాల్లోనే ఉండాల్సి ఉండగా, మాజీ స్పీకర్, ప్రస్తుత వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఇది బాన్సువాడకు వచ్చిందని చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. నియోజకవర్గంపై ఆయనకు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో ఈ కళాశాలను రాష్ట్రంలోనే ఏకైక పూర్తి ఉచిత నర్సింగ్ కళాశాల గా నడుపుతున్నామని చెప్పారు. దీంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల సిబ్బంది కష్టాన్ని కూడా చైర్మన్ ప్రశంసించి, మంచి ఫలితాలకు అభినందనలు తెలిపారు.





Post a Comment

Previous Post Next Post