Top News

BJYM Protest | ఫీజు బకాయిలపై బీజేవైఎం ర్యాలీ, ధర్నా

ఫీజు బకాయిలపై బీజేవైఎం ర్యాలీ, ధర్నా

ఎండల లక్ష్మినారాయణ పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు  

15 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

బాన్సువాడ టౌన్, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో శుక్రవారం బాన్సువాడలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

"ఫీజు బకాయి బిజెపి లడాయి" పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో BJYM కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎండల లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 15,000 కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజు,నాయకులు పైడిమల్ లక్ష్మినారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కొనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా BJYM నాయకులు మాట్లాడుతూ ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం అంతా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.








Post a Comment

Previous Post Next Post