పది కేజీల వెండి, మూడున్నర గ్రాముల నగల చోరీ
చోరీ సొత్తు విలువ రూ.20 లక్షల పైనే
ఆగని వరుస దొంగతనాలు
భయాందోళనల్లో ప్రజలు
తెలంగాణ డైలీ న్యూస్, నిర్మల్:
నిర్మల్ లో దొంగతనాలు దోపిడీల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా శనివారం అర్ధరాత్రి పట్టణంలోని హరిహర క్షేత్రం లో దోపిడి జరిగింది ఈ దోపిడీలో మూడు దేవాలయాల్లో దేవత మూర్తులకు అలంకరించిన నగలన్నీ దోపిడీకి గురయ్యాయి. వివరాలు లో ఉన్నాయి నిర్మల పట్టణంలోని హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం తో పాటు పలు దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రాంగణంలో శనివారం అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేసి దోచుకెళ్లారు అమ్మవారి దేవాలయం సుబ్రమణ్య స్వామి దేవాలయం వినాయక దేవాలయాల్లో దేవత మూర్తులకు అలంకరించిన వెండి బంగారు నగలను దోచుకెళ్లారు ఈ దోపిడీలో అమ్మవారి మెడలోని పది గ్రాముల మంగళసూత్రం, పది గ్రాముల బంగారు ముక్కుపుడక, మూడు గ్రాముల బంగారు బొట్టు బిళ్ళ, పది తులాల వెండి కిరీటం, ప్రధాన విగ్రహం కోసం ఏర్పాటుచేసిన 2 కిలోల వెండి కిరీటం, 10 తులాల వెండి కాసులపేరు దోపిడికి గురయ్యాయి. అలాగే గణపతి దేవాలయంలో అర కిలో వెండి కిరీటం దోచుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అరకిలో వెండి కిరీటం, 3.500 కిలోల మకర తోరణం, 3 కిలోల నాగఫణి, పుట్ట చోరీకి గురయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దోపిడి సొత్తు విలువ రూ.25 లక్షల మేర ఉంటుందని భావిస్తున్నారు. దొంగలు గుడి ఆవరణలోకి రాగానే అక్కడ కాపలా ఉండేవారి నివాసాలకు బయటనుండి గొళ్ళెం పెట్టి దోపిడి చేసారు. ఉదయం ఎప్పటిలాగే పూజారులు గుడికి పూజల నిమిత్తం రాగానే గుడుల తలుపులు తెరిచి ఉండటం గమనించి దేవాలయ నిర్వహణ కమిటీ కి సమాచారం అందించారు. కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలను సేకరించారు. డి ఎస్పీ శ్రీనివాస్ కేసు దర్యాప్తు ప్రారంభించారు.




Post a Comment