బోర్లం గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఎగురవేసిన గ్రామ మాజీ ఎంపిటిసి సభ్యురాలు పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి
బాన్సువాడ :ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బోర్ల గ్రామంలోని విలేజ్ పార్క్ వద్ద జాతీయ జెండాను గ్రామ మాజీ ఎంపిటిసి సభ్యురాలు పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
గ్రామ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల హెచ్.ఎం, ప్రైమరీ స్కూల్ హెచ్.ఎం, విద్యార్థిని విద్యార్థులు, వార్డ్ సభ్యులు, పురప్రముఖులు, యువజన సంఘాల సభ్యులు, అంబేద్కర్ సంఘం సభ్యులు, మైనారిటీ సోదరులు, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామపెద్దలు, మాజీ రాజకీయ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment