నిజామాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
ఘన స్వాగతం పలికిన కలెక్టర్,ఎంపీ, ఎమ్మెల్యేలు
నిజామాబాద్ : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉదయం జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, వైడీ రాకేష్ రెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ రోడ్డు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. (స్వాగతం పలుకుతున్న వీడియో 👇)
ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు:- భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్: ఉదయం 11:00 గంటలకు యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
- జాతీయ పసుపు బోర్డు కార్యాలయం: మధ్యాహ్నం 12:15 గంటలకు పసుపు బోర్డును సందర్శించి, పసుపు రైతులతో సమావేశం అవుతారు. అలాగే మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
- పీహెచ్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్: మధ్యాహ్నం 1:50 గంటలకు అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.
- ఆ తర్వాత మధ్యాహ్నం 3:20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమై హైదరాబాద్‌కు బయలుదేరతారు.


Post a Comment