Top News

Har Ghar Tiranga | కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

 


కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ 

వందేమాతరం 150వ ఏట, 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాన్సువాడలో భారీ ర్యాలీ

బాన్సువాడ:  దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బాన్సువాడ డివిజన్ కేంద్రంలో శుక్రవారం తిరంగా ర్యాలీ కన్నుల పండుగగా సాగింది.

భారత ప్రధాని  నరేంద్ర మోదీ పిలుపు మేరకు, వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించారు.

మాజీ శాసన సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల గుండా జూనియర్ కళాశాల వరకు సాగింది. త్రివర్ణ పతాకాల రెపరెపల మధ్య దేశభక్తి నినాదాలతో హోరెత్తిన ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ గీతం జనగణమన ఆలాపనతో ముగిసింది.

ప్రజల భారీ భాగస్వామ్యం

ఈ ర్యాలీలో పట్టణ వ్యాపారస్తులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీలో సాగారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం రాజు, నాయకులు కొనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, జీ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్చీదుర సాయిలు, గంగారాం తదితరులు పాల్గొన్నారు. వీడియో 👇




Post a Comment

Previous Post Next Post