Top News

Hotel Bill Reel | హోటల్‌లో బిల్లు కట్టకుండా బిర్యానీ పార్సల్ తో ఉడాయించిన వ్యక్తి

హోటల్‌లో బిల్లు కట్టకుండా బిర్యానీ పార్సల్ తో ఉడాయించిన వ్యక్తి 

సీసీ ఫుటేజీతో రీల్ చేసి వసూలుకు ప్రయత్నించిన యజమాని

జగిత్యాల/TDN, ఆగస్టు 29:

సినిమాలోలా హోటల్‌లో తిని బిల్లు కట్టకుండా వెళ్తే ప్లేట్లు కడగాల్సి వస్తుందని చూశాం. కానీ జగిత్యాలలో ఓ హోటల్ యజమాని బిల్లు వసూలుకు వినూత్నంగా సోషల్ మీడియాను వాడుకున్నారు.

జగిత్యాల కొత్త బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురుగా ఉన్న హోటల్‌లో ఓ వ్యక్తి రూ.650 విలువైన బిర్యానీ పార్సల్ చేయించుకున్నాడు. బస్సు వచ్చిందన్న హడావిడిలో బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయాడని యజమాని చెబుతున్నారు.

దీంతో యజమాని సీసీ కెమెరా ఫుటేజీని రీల్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన రూ.650 బిల్లు చెల్లించాలని, ఈ వీడియో ఆ వ్యక్తికి చేరేలా షేర్ చేయాలని కోరారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (వీడియో 👇)



Post a Comment

Previous Post Next Post