Top News

Kasula Meets Ministers | ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చ

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్  కాసుల బాలరాజ్ సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు చైర్మన్ కాసుల బాలరాజ్ తెలిపారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరేలా తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ పూర్తి సహకారం అందిస్తుందని, రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

మంత్రులు కూడా ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు చైర్మన్ తెలిపారు.ఈ భేటీలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో పాటు గోపాల్ రెడ్డి, ప్రదీప్ పటేల్, భవాని ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post