త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ డైలీ న్యూస్, సిద్ధిపేట: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత దాస అంజయ్య తల్లి గౌరమ్మను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదివారం పరామర్శించారు.
ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మైనంపల్లి
ఇటీవల ఇంట్లో నడుస్తుండగా జారిపడిన గౌరమ్మకు పక్కటెముకలు విరిగి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న మైనంపల్లి, సిద్ధిపేటలోని అంజయ్య నివాసానికి వెళ్లారు. గౌరమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
"అవ్వా ఆరోగ్యం జాగ్రత్త. భయపడకు, నేనున్నాను" అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. సరైన సమయంలో మందులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పూజల హరికృష్ణ, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివన్నగారి ఆంజనేయులు గౌడ్, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సిద్ధిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమాం పాల్గొన్నారు.
అదేవిధంగా చిన్నకోడూరు, నంగునూరు మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు మీసం మహేందర్, దేవులపల్లి యాదగిరి, ఆత్మ కమిటీ ఛైర్మన్ పూజల గోపికృష్ణ, మహిళా కాంగ్రెస్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ, సీనియర్ నేతలు మార్క సతీష్, బొమ్మల యాదగిరి, కలీముద్దీన్, సిద్ధిపేట అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భిక్షపతి, గౌడ సంఘం అధ్యక్షుడు నవీన్ గౌడ్, పెంబర్ల మల్లేశం, లహరి, రజనీ, సన తదితరులు మైనంపల్లి వెంట ఉన్నారు.




Post a Comment