మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బాధ్యతలు స్వీకరణ
మైనార్టీల హక్కుల పరిరక్షణకు కృషి : తోట
హైదరాబాద్:తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు సోమవారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణతో పాటు సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు.
ఈ బాధ్యతాయుతమైన పదవిని చేపట్టిన తోట లక్ష్మీకాంతారావుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), శాసనమండలి సభ్యులు (ఎమ్మె్ల్సీలు) పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు.




Post a Comment