బాన్సువాడలో ఘనంగా వనమహోత్సవం
మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే పిలుపు
బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పురపాలక సంఘం, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో, ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో, అలాగే బోర్లం క్యాంప్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం మోస్రా మండలం గోవింద్ పేట్ (గోవూరు) గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... "మొక్కలు నాటుదాం - పర్యావరణాన్ని కాపాడుదాం" అని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను నరకడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కల పెంపకం వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
వనమహోత్సవం ఉద్దేశం కేవలం మొక్కలు నాటడమే కాదని, నాటిన మొక్కను బిడ్డలా పెంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మొక్కల ప్రాధాన్యతను తెలుసుకోవాలని, తమ ఇంటి ఆవరణలో, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, నాయకులు మోహన్ నాయక్, గురువు వినయ్ కుమార్, అసద్దిన్ మోసిన్, అబ్దుల్ ఖాలిక్, గౌస్, నార్ల రవీందర్, గోపాల్ రెడ్డి, నార్ల సురేష్, జలీల్, హాస్టల్ విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








Post a Comment