Top News

MLA PSR | లైట్ మోటర్ వెహికల్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాలు

లైట్ మోటర్ వెహికల్ యూనియన్ ఆధ్వర్యంలో  బోనాలు 

ఉత్సవాల్లో  పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ:ఆషాఢమాసం సందర్భంగా బాన్సువాడ లైట్ మోటర్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బోనాల మహోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో చల్లని వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ "తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మన సాంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం" అని పేర్కొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్వాల కృష్ణారెడ్డి, నార్ల రవీందర్, నార్ల సురేష్, గోపాల్ రెడ్డి, గురు వినయ్ కుమార్, కౌన్సిలర్ ఖలీక్, కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ గౌస్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post