Top News

PBR Protest | తగిలేపల్లి మాజీ సర్పంచ్ హత్యకు నిరసనగా వర్ని చౌరస్తాలో ధర్నా

తగిలేపల్లి మాజీ సర్పంచ్ హత్యకు నిరసనగా వర్ని చౌరస్తాలో ధర్నా

  • నిందితులను కఠినంగా శిక్షించాలి : పోచారం భాస్కర్ రెడ్డి
  • బాన్సువాడ - వర్ని: వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేశ్వర్లు (వెంకన్న) హత్యకు నిరసనగా మంగళవారం వర్ని చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

భాస్కర్ రెడ్డి ఏమన్నారంటే..

ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ వెంకన్న హత్య తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

బాన్సువాడ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు, హింసకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గతంలో ప్రశాంతంగా ఉన్న బాన్సువాడలో వలస నాయకుల రాజకీయ జోక్యంతో హింస, అలజడి పెరిగిందని ఆరోపించారు.

అదే గ్రామానికి చెందిన బక్క నారాయణ ఈ ఘటనలో నిందితుడిగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని, ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

బాన్సువాడ నియోజకవర్గం ఎప్పుడూ శాంతి, సామరస్యాలకు నిలయమని, ఇక్కడ హింసకు, హత్యా రాజకీయాలకు, భయభ్రాంతులకు ఎలాంటి స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాన్ని కలిగించే రాజకీయాలకు స్వస్తి పలకాలని, హింసను ప్రోత్సహించే రాజకీయ నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తిరస్కరించాలని పిలుపునిచ్చారు. (వీడియో 👇)





నినాదాలతో హోరెత్తిన చౌరస్తా

ధర్నా సందర్భంగా కార్యకర్తలు "హత్యా రాజకీయాలను ప్రోత్సహించే నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి డౌన్ డౌన్, హత్యా రాజకీయాలు నశించాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.






Vedios 👇👇



Post a Comment

Previous Post Next Post