Top News

Professor's Jayanti | రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషి చిరస్మరణీయం : కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్

3వ వార్డు కొయ్యగుట్ట సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో ఘనంగా జయశంకర్ జయంతి   

రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషి చిరస్మరణీయం : కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు పరిధిలోని కొయ్యగుట్ట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. 

స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ భాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్ హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ హకీమ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలని సూచించారు.

అనంతరం కౌన్సిలర్ హకీమ్ స్కూల్ హాస్టల్ భోజనశాలను సందర్శించారు. విద్యార్థులకు సరైన వసతి, ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీ భాయి స్కూల్‌లో ఉన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ హకీమ్, బాన్సువాడ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్  కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి  దృష్టికి సమస్యలను తీసుకెళ్లి త్వరలో పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post