బాన్సువాడ నల్ల పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు
అమ్మవారికి స్వయంగా బోనం సమర్పించిన ఎమ్మెల్యే పోచారం
ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ :
ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో మంగళవారం ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.
ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. వారు స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాసుల విజయ గారు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి గీతాలు, డప్పు చప్పుళ్లతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.
Video 👇👇




Post a Comment