Top News

RDO's Visit | ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులను పరిశీలించిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులను పరిశీలించిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి

బాన్సువాడ:  బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం శిక్షణ తరగతులను బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.

ఎకనామిక్స్, ఫిజిక్స్, సివిక్స్, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన శిక్షణ తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.

కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంతో కలిసి ఆర్డీఓ రవీందర్ రెడ్డి వివిధ తరగతి గదులను సందర్శించారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు అధ్యాపకులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. బోధనా పద్ధతులు, సబ్జెక్టు అంశాలను అధ్యాపకులకు వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అధ్యాపకుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇలాంటి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలన  

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించనున్నట్లు ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, అధ్యాపకులకు అందుతున్న శిక్షణ తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Post a Comment

Previous Post Next Post