Top News

Street Vendors | చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయింపు

చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయింపు

ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చొరవ

బాన్సువాడ:  HDFC బ్యాంకు సమీపంలో రోడ్డుపై ప్రతిరోజు కూరగాయలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు శుక్రవారం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.  తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు వ్యాపారులకు నెంబర్లు అలాట్ చేసి, చైతన్య కాలనీకి వెళ్లే మార్గంలో వారికి విక్రయ స్థలాన్ని కేటాయించారు.

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం 

ఈ సందర్భంగా చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ పాత బాన్స్వాడకు వెళ్లే మార్గంలో చిరు వ్యాపారులు కూరగాయల బండీలు పెట్టడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే వ్యాపారులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు.

వ్యాపారులు అందరూ తమకు కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్ వార్డు కౌన్సిలర్ కాలిక్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ అధికారులు సతీష్, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post