విద్యార్థులపై వార్డెన్ దాడి
బీసీ హాస్టల్ వార్డెన్‌పై విద్యార్థుల ఆరోపణలు
నిజామాబాద్ జిల్లా చందూర్‌లో ఘటన
బాన్సువాడ : చందూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో వార్డెన్ విద్యార్థులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ 10 మంది విద్యార్థులను కర్రతో కొట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
తప్పు చేయలేదన్న విద్యార్థులు
తాము ఎలాంటి తప్పు చేయలేదని విద్యార్థులు చెప్పినప్పటికీ, వార్డెన్ మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు కర్రతో కొట్టారని వారు తెలిపారు. ఈ దాడిలో విద్యార్థుల శరీరాలపై దెబ్బల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం.
తల్లిదండ్రులు, స్థానికుల ఆందోళన
ఘటన తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
విద్యార్థులపై దాడికి పాల్పడిన వార్డెన్‌పై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులు, తల్లి దండ్రుల వీడియో 👇

Post a Comment