బాన్సువాడలో అనారోగ్యంతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య
బాన్సువాడ, ఆగస్టు 08: గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స ఫలించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ సిఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, టీచర్స్ కాలనీ లో నివసించే అంబిల్పూర్ బాలరాజు భార్య రజిని(34) గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతోందని, పలు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నప్పటికీ తగ్గలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఆగస్టు 07న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Post a Comment