బాన్సువాడలో సెప్టెంబర్ 16న అతి పెద్ద జాతీయ సమైక్యతా సదస్సు
పోస్టర్లను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్
హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మత పెద్దల భారీ సమాగమం: నిర్వాహకులు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా ఖాస్మీ
బాన్సువాడ, సెప్టెంబర్ 09: మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి) బాన్సువాడ ఆధ్వర్యంలో చరిత్రాత్మక, భారీ స్థాయిలో ఖౌమీ ఏకజేహతీ కాన్ఫరెన్స్ - జాతీయ సమైక్యతా సదస్సు నిర్వహించనున్నట్లు మదర్సా నాజిమ్ ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా ఖాస్మీ తెలిపారు.
ఈ సదస్సుకు సంబంధించిన ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, అమీర్-ఎ-మిల్లత్ ఇస్లామియా తెలంగాణ నాయబ్ అమీర్ హాఫిజ్ మహమ్మద్ లయీఖ్ ఖాన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అధ్యక్షులు అమృతం వీరా బ్రహ్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ కార్పొరేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వర్ సోల్మన్ చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సీనియర్ కాంగ్రెస్ నేత అఫ్రోజ్ పాల్గొన్నారు.
ఈ అతి పెద్ద జాతీయ సమైక్యతా సదస్సు సెప్టెంబర్ 16, 2026 బుధవారం సాయంత్రం 7 గంటలకు, బాన్సువాడ మార్కెట్ యార్డ్ గంజ్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, రాజకీయ, సామాజిక నాయకులు, మేధావులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
ముఖ్య అతిథులు:
ఈ సదస్సుకు కర్ణాటక ప్రముఖ వక్త మౌలానా పి.ఎం. ముజమ్మిల్ సాహెబ్ వాలాజాహి రషాది, మౌలానా హుసాముద్దీన్ జాఫర్ పాషా సాహెబ్, సాహెబ్జాదా మరియు మౌలానా ఆఖిల్ సాహెబ్ వారసులు మరియు అమీర్-ఎ-మిల్లత్ ఇస్లామియా తెలంగాణ ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమం మౌలానా గులాం యజ్దాని సాహెబ్ (అధ్యక్షులు, జమియత్ ఉలమా, బీదర్ జిల్లా) పర్యవేక్షణలో, హాఫిజ్ మహమ్మద్ లయీఖ్ ఖాన్ అధ్యక్షతన, హాఫిజ్ ఫహీముద్దీన్ మునీరి సాహెబ్ (అధ్యక్షులు, జమియత్ ఉలమా, కామారెడ్డి జిల్లా) నిర్వహణలో జరుగుతుంది.
రాజకీయ నాయకులు: సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరుకానున్నారు.
వివిధ మతాల పెద్దలు: హిందూ ధర్మానికి చెందిన డాక్టర్ యజ్ఞం పూర్ణ కుమార్ శర్మ, క్రైస్తవ మతానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వర్ సోల్మన్, సిక్కు మతానికి చెందిన సర్దార్ రాజేందర్ సింగ్ (అధ్యక్షులు, గురుద్వారా నిజామాబాద్), హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు అమృతం వీరా బ్రహ్మన్ పాల్గొంటారు.
అలాగే ముస్లిం సమాజానికి చెందిన వివిధ మస్లక్ లకు చెందిన ఉలమాలు మౌలానా సులేమాన్, మహమ్మద్ అఫ్రోజ్, అబ్దుల్ అజీమ్ (అమీర్, జమాత్-ఎ-ఇస్లామీ, కామారెడ్డి), అబ్దుల్ వాజిద్, మౌలానా కరీముద్దీన్ కమాల్ ఖాద్రీ ప్రసంగిస్తారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ సమైక్యత, పరస్పర సహనం ఎంతో అవసరమని, శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించడానికి అన్ని మతాల ప్రజలు ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా ఖాస్మీ పిలుపునిచ్చారు.




Post a Comment