బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీటి విప్లవం: ప్రతి ఎకరాకూ సాగునీరే మా లక్ష్యం — వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి
ప్రజలే నా కుటుంబం... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు పోచారం: మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 09 (తెలంగాణ డైలీ న్యూస్): వర్ని మండలం జాకోర గ్రామంలో జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కలిసి ప్రారంభించి ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...
- సాగునీటి విస్తరణ: నిజాంసాగర్ నీరు అందని మంజీరా నది పరివాహక ప్రాంతాలైన బీర్కూర్, కోటగిరి, బాన్సువాడ మండలాల్లోని కిష్టాపూర్, పోతంగల్, కారేగావ్, హంగిర్గ, కొడిచర్ల, సుంకిని, కొన్నూరు, ఎగ్దోల్లి తదితర ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించామని తెలిపారు.
- భారీ లక్ష్యాలు: బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 1.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కింద 30 వేల ఎకరాలు, నిజాంసాగర్ కింద 90 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని వెల్లడించారు.
- సిద్ధాపూర్ రిజర్వాయర్: రూ.258 కోట్ల అంచనా వ్యయంతో, 1 టీఎంసీ నీటి సామర్థ్యంతో సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను నిర్మించి, జాకోర, చందూర్, సిద్ధాపూర్, చింతకుంట ప్రాజెక్ట్ల ద్వారా సుమారు 24 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
- ప్రాధాన్యతా రంగాలు: వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధి తర్వాత పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. పేదరికం పిల్లల చదువుకు అడ్డంకి కారాదనే ఉద్దేశంతోనే నియోజకవర్గంలో మండలానికి ఒక జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు నర్సింగ్, పాలిటెక్నిక్, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. Video 👇
జాకోరలో నిర్వహించిన సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... నిజాంసాగర్ నీళ్లు జాకోరకు వస్తాయని ఎవరూ కలలోనైనా ఊహించలేదని, ఆ అసాధ్యాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి సుసాధ్యం చేసి చూపించారని కొనియాడారు.
- ప్రజల కోసమే నిబద్ధత: పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టిలో కుటుంబం కంటే ప్రజలే ఎక్కువని తెలిపారు. తన తల్లికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనూ, కెనాల్ నీటిని విడుదల చేసే సమయం రావడంతో కుటుంబ పరిస్థితిని పక్కన పెట్టి వచ్చి మరీ నీటిని విడుదల చేయించిన నాయకుడని గుర్తుచేశారు.
- అభివృద్ధి కోసం పార్టీ మార్పు: సిద్ధాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడానికి, రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదని స్పష్టం చేశారు.
- ప్రత్యర్థులకు గట్టి కౌంటర్: గతాన్ని మరచిపోయి విమర్శలు చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిల చరిత్ర ప్రజలకు బాగా తెలుసని, బాన్సువాడ ప్రజలను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. హింస, కక్షలు కాకుండా శాంతి మరియు అభివృద్ధే తమ విధానమని తేల్చిచెప్పారు.








Post a Comment