Top News

Municipality | బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి, పేడ గణపతుల ఉచిత పంపిణీ

బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి, పేడ గణపతుల ఉచిత పంపిణీ

చవితి పండుగను ప్రకృతికి హాని చేయకుండా జరుపుకోవాలి : కాసుల బాలరాజు 

బాన్సువాడ, సెప్టెంబర్ 14: బాన్సువాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మట్టి మరియు ఆవు పేడతో తయారుచేసిన గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని రక్షిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు మున్సిపాలిటీ తరపున మట్టి, పేడ విగ్రహాల ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

చవితి పండుగను ప్రకృతికి హాని చేయకుండా జరుపుకోవాలని, మట్టితో చేసిన విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని, ఆవు పేడతో తయారుచేసిన విగ్రహాలు సనాతన ధర్మం ప్రకారం ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారని తెలిపారు. విగ్రహాలను తయారుచేసిన గోవర్ధిని గోశాల, తిరుమలాపూర్ నిర్వాహకులు తాండ్లె శ్రీనివాస్, సతీష్ లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కాసుల రోహిత్, మాసాని రవీందర్ రెడ్డి, నార్ల రవీందర్, మహమ్మద్ ఎజాజ్, గోపాల్ రెడ్డి, మట్ట సాయిలు యాదవ్, దాసరి శ్రీనివాస్, ప్రదీప్ పటేల్, బోడ భాస్కర్, కౌన్సిలర్లు మహమ్మద్ కాలేక్, కటికె రమేష్, జంగం రాజశేఖర్, గజ్జల మహేష్, ఎండి హకీమ్, కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, మక్బూల్, నార్ల నందకిషోర్, ఖలీల్, లాయక్, ఫెరోజ్, పాశం భాస్కర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మజ్జు తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post