Praja Palana | జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

 


కామారెడ్డి జడ్పీలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండా ఆవిష్కరణ

బాన్సువాడలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ

జుక్కల్ లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు జెండా ఆవిష్కరణ - డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ హాజరు

జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

కామారెడ్డి / బాన్సువాడ / జుక్కల్, సెప్టెంబర్ 17:

తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా అధికారికంగా నిర్వహిస్తోంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

బాన్సువాడ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన చారిత్రక ఘట్టాన్ని, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ నాయకులు నార్ల సురేష్, మహ్మద్ గౌస్, ప్రజా  ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










Post a Comment

Previous Post Next Post