హైదరాబాద్‌లో పోచారం కుటుంబం వినాయక పూజలు - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణపతి బప్పా మోరియా... మంగళమూర్తి మోరియా అంటూ భక్తిశ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి పుష్ప, కుమారుడు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి, మనుమలు రుషాంక్ రెడ్డి, రిషిక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలను ప్రసాదించాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా గణనాథుని ఆశీస్సులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.







Post a Comment