WAKO 1st Para Kickboxingలో తెలంగాణకు స్వర్ణం - కామారెడ్డి బిడ్డ సత్తా
ఇండోర్ వేదికగా P1 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించిన గూడెం గ్రామానికి చెందిన గుడుగుల అరవింద్ కుమార్
కామారెడ్డి, సెప్టెంబర్ 14: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెప్టెంబర్ 11న నిర్వహించిన WAKO 1st Para Kickboxing Championshipలో తెలంగాణ క్రీడాకారుడు సత్తా చాటాడు.
కామారెడ్డి జిల్లాకు చెందిన గూడెం గ్రామానికి చెందిన గుడుగుల అరవింద్ కుమార్అ ద్భుత ప్రతిభ కనబరిచి P1 కేటగిరీలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.
ఈ జాతీయ స్థాయి పోటీలలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన 12 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన P1 కేటగిరీ ఫైనల్స్‌లో అరవింద్ కుమార్ అన్ని రౌండ్లలో ఆధిపత్యం చూపి గోల్డ్ మెడల్ ను తెలంగాణ ఖాతాలో వేశారు.
కామారెడ్డి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఈ పతకం గర్వకారణం. పారా కిక్ బాక్సింగ్ విభాగంలో తెలంగాణ నుంచి మొదటి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా అరవింద్ కుమార్ చరిత్ర సృష్టించారు.
అరవింద్ కుమార్ ను పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Post a Comment