గాంధారి ఏటీఎం చోరీలో సంచలన విషయాలు - కేవలం 12 నిమిషాల్లోనే లక్షలు మాయం!
కామారెడ్డి జిల్లాను వణికిస్తున్న గ్యాస్ కట్టర్ ముఠా?
గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జరిగిన ఏటీఎం చోరీ వెనుక ప్రొఫెషనల్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఏటీఎంలో ఈ దొంగతనం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాలు:
- దుండగులు గ్యాస్ కట్టర్ తో కేవలం 10-12 నిమిషాల్లోనే ఏటీఎంను కట్ చేసి నగదు ఎత్తుకెళ్లారు.
- ముఖానికి గుడ్డలు కట్టుకుని, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు.
- అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- గతంలో కూడా జిల్లాలో ఇదే తరహాలో ఏటీఎం చోరీలు జరగడం - అదే ముఠా పనేనా అనే కోణంలో దర్యాప్తు.
ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న గాంధారి పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు.
చోరీ అయిన నగదు వివరాలను బ్యాంక్ అధికారులు లెక్కిస్తున్నారు. లక్షలకు పైగా చోరీ అయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా.
కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.





Post a Comment