Batukamma Facilities | బాన్సువాడ మున్సిపాలిటీలో ముమ్మర ఏర్పాట్లు

బతుకమ్మ వేడుకలకు బాన్సువాడ మున్సిపాలిటీలో ముమ్మర ఏర్పాట్లు

మహిళలకు ఇబ్బందులు లేకుండా చర్యలు - చైర్ పర్సన్ విజయ ఆదేశాలతో తనిఖీ

బాన్సువాడ, అక్టోబర్ 8:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పరిశీలించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ ఆదేశాల మేరకు కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వరం కాలనీ తదితర ప్రాంతాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్లు దొనకంటి వెంకట్, భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post