Copper Wire Theft | బాన్సువాడలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో భారీ చోరీ

బాన్సువాడలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో భారీ చోరీ

రూ.4 లక్షల విలువైన 250 కిలోల కాపర్ వైర్ అపహరణ

కట్టర్లతో కిటికీలు, ఫెన్సింగ్ కట్ చేసిన ప్రొఫెషనల్ దొంగలు

బాన్సువాడ, 15 అక్టోబర్: బాన్సువాడ పట్టణంలోని టీజీఎస్పీడీసీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు సుమారు 230 నుండి 250 కిలోల కాపర్ వైర్ ను దొంగిలించారు. దీని విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

ప్రొఫెషనల్ దొంగలుగా భావిస్తున్న నిందితులు మరమ్మత్తు కేంద్రంలోని ఇనుప కిటికీల ఐరన్ రాడ్లను, ఫెన్సింగ్ ను కట్టర్ ద్వారా కట్ చేసి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

ఈ కాపర్ వైర్ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉపేందర్ రెడ్డికి చెందినదిగా తెలిసింది. చోరీపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ బృందాన్ని పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇటీవల గాంధారిలో ఏటీఎం ను గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీ చేసిన తరహాలోనే ఇక్కడ కూడా చోరీ జరగడం గమనార్హం.



Post a Comment

Previous Post Next Post