Driver's Negligency | డెంటల్ కాలేజీ వద్ద బస్సు ఆపడానికి నిరాకరించిన డ్రైవర్

డెంటల్ కాలేజీ వద్ద బస్సు ఆపడానికి నిరాకరించిన డ్రైవర్ 

పరీక్షలు ఉన్నాయని వేడుకున్న విద్యార్ధినులు 

ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎం కు విజ్ఞప్తి

బాన్సువాడ, 15 అక్టోబర్: నిజామాబాద్ డిపో-2 కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు నంబర్ TG16T 2581 డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కొంతమంది విద్యార్థినులు పరీక్ష తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై తల్లిదండ్రులు, సామాజిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బాన్సువాడ నుండి మేఘన డెంటల్ కాలేజీ నాగారం కు గురువారం ఉదయం పరీక్షకు వెళ్తున్న కొంతమంది విద్యార్థినులు డెంటల్ కాలేజీ స్టాప్ వద్ద బస్సు ఆపాలని డ్రైవర్ ను కోరగా, డ్రైవర్ నిరాకరించాడు. విషయాన్ని గమనించిన ఓ రిపోర్టర్ వెంటనే స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్ ను సంప్రదించగా, లేడీ కండక్టర్ కు డెంటల్ కాలేజీ వద్ద బస్సు ఆపాలని డీఎం ఆదేశించారు.

విద్యార్థినులు బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి "డీఎంకు ఫోన్ ఎందుకు చేశావు" అంటూ బస్సు ఆపనని చెప్పి వారిని కిందకు దింపేశాడు. పరీక్షల సమయం అని విద్యార్థినులు వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో వారు కొంత సేపు తర్వాత వేరే బస్సులో వెళ్లాల్సి వచ్చింది.

పరీక్ష సమయంలో విద్యార్థులను బస్సు నుండి కిందకు దింపడం బాధాకరమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు డ్రైవర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే స్కూళ్లు, కాలేజీలు ఉన్న చోట్ల అన్ని డిపోల బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ సౌకర్యం కల్పించాలని, భవిష్యత్తులో ఏ విద్యార్థి విద్యాపరంగా నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు ఆర్ఎం నిజామాబాద్ ను కోరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post