బాన్సువాడలో మంత్రి సీతక్క పర్యటన - అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు
27న పలు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు
ఏర్పాట్లపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష - ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం
బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అక్టోబర్ 27వ తేదీ మంగళవారం రోజున బాన్సువాడ నియోజకవర్గంలో జరగనున్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు.
ఏర్పాట్లపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష:
మంత్రి పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.
మంత్రి పర్యటన షెడ్యూల్:
1. మధ్యాహ్నం 2:00 గంటలకు - కొయ్యగుట్ట తాండా: బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ.
2. మధ్యాహ్నం 3:00 గంటలకు - బాన్సువాడ పట్టణం: పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం.
3. మధ్యాహ్నం 3:30 గంటలకు - బోర్లం గ్రామ శివారు: బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం.
ఈ కార్యక్రమాల ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో చేపట్టి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.




Post a Comment